హైదరాబాద్‌లో భారీ వర్షం..

7
- Advertisement -

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం వరకు ఉక్కబోతను అనుభవించిన హైదరాబాద్‌ ప్రజలు ఆ తర్వాత రిలాక్స్ అయ్యారు. అయితే, పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ లోని మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్, పంజాగుట్టా, గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అంతా అలెర్ట్ అయ్యారు.

Also Read:అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్!

- Advertisement -