నేడు భారీ వర్షసూచన…

178
rains
- Advertisement -

ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దకాగా నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య మధ్యప్రదేశ్‌, పరిసరాల్లో ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఫలితంగా రాష్ట్రంలో ఇవాళ చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌రూరల్‌, వరంగల్‌అర్బన్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

చాలా ఏళ్ల తర్వాత గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి, 60 అడుగులకుపైగా నది ప్రవహిస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతం నీట మునిగింది. రెండు మూడు రోజులుగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

- Advertisement -