హైదరాబాద్‌లో భారీ వర్షం..

56
- Advertisement -

ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఎర్రమంజిల్‌, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, అమీర్‌పేట, తర్నాక, చింతల్‌బస్తి, సోమాజిగూడ, నాంపల్లి, లక్డీకపూల్‌, కోఠిలో కుండపోతగా వర్షం కురిసింది.

ఒక్కసారిగా వరణుడు విరుచుకుపడటంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది.

- Advertisement -