టీటీడీకి భారీ విరాళం..

17
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన వివేక్ కైలాస్,విక్రమ్ కైలాస్ అనే ఇద్దరు భక్తులు రూ.1.5 కోట్ల విరాళాన్ని అందించారు. ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు తమ కంపెనీ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డీడీ తీసి.. డీడీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

శ్రీవెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ద్వారా.. ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కిడ్నీ, గుండె , బ్రెయిన్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స చాలా ఖరీదుతో కూడుకున్నది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్, బర్డ్, ఎస్వీఆర్ఆర్, మెటర్నిటీ ఆస్పత్రుల్లో వీరికి ఉచితంగా చికిత్స అందించేందు ఈ డబ్బు సాయ పడుతుందని చెప్పారు.

Also Read:గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..ఓటీటీ పార్ట్‌నర్ లాక్!

- Advertisement -