ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ తో సహా దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్.
రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకు అంత బడ్జెట్ కేటాయించడంపై హీరో ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. కల్కి మూవీ గ్లోబల్ ఆడియెన్స్ కోసం రూపొందించామని.. అందుకే ఈ సినిమాకు అంత భారీ బడ్జెట్ అయ్యిందని చెప్పారు.
ఈ సినిమాలో చాలా మంది గొప్ప నటీనటులు ఉన్నారని.. వారి నటనతో ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారని ప్రభాస్ చెప్పుకొచ్చారు. సినిమాను చూసిన తరువాత మరో ప్రపంచాన్ని వీక్షించిన అనుభూతి కలుగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.
Also Read:ముగిసిన వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు