తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్‌లో భారీ వర్షాలతో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. ఆసిఫ్‌నగర్–హబీబ్‌నగర్ మాంగారిబస్తీకి చెందిన మామాఅల్లుళ్లు అర్జున్(26), రాము(25) వరదల్లో గల్లంతు అయ్యారు. ముషీరాబాద్-వినోదానగర్‌లో నాలాలో పడి కొట్టుకుపోయాడు సన్నీ అనే యువకుడు. షేక్‌పేట, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్ ప్రాంతాలను కుదిపేసింది భారీ వర్షం.
Also Read:‘మిరాయ్’కి అద్భుత స్పందన

