తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిపోతోంది. తెలంగాణలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించగా ఖమ్మం జిల్లాల్లో వడగళ్ల వాన కురవడంతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలియజేశారు.
ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఇవాళ రాష్ట్రంలో 25 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మరియు అల్లూరి జిల్లా రంపచోడవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.
Also Read:అట్లీతోనే బన్నీ…ఫిక్స్!