- Advertisement -
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో HYD వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయాల్లో సాధారణం కంటే వేడిగా ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని…శరీరాన్ని చలబర్చే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు.
Also Read:KCR:రైతు కుటుంబానికి కేసీఆర్ సాయం..
- Advertisement -