మరో 5 రోజులు హీట్ వేవ్!

8
- Advertisement -

రాష్ట్రంలో మరో ఐదు రోజులు హీట్ వేవ్ కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వేడిగాలులు మరో నాలుగు లేదా ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మరియు జగిత్యాల వంటి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోయాయి. మంచిర్యాల, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, రాష్ట్ర రాజధానిలో 42.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నైరుతి రుతుపవనాలు 24 గంటల వ్యవధిలో కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది.తెలంగాణలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రుతు పవనాల ముందు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈసారి ఎల్‌నినో ప్రభావం బలహీనపడడం, లా నినా ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

Also Read:Yevam:యేవ‌మ్… ర్యాప్ సాంగ్

- Advertisement -