తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్‌ను వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అదిలాబాద్, కొమ్రం భీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా ఉండొచ్చు అని తెలిపారు..
మధ్య, దక్షిణ, తూర్పు తెలంగాణలో చినుకులు లేదా గాలివానలు పడే అవకాశం ఉందని… హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 36-37°C మధ్య ఉండొచ్చు అన్నారు. సాయంత్రం సమయంలో వానలు పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్‌లో తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కోస్తాంధ్రలో గరిష్ఠ ఉష్ణోగ్రత 2-3°C తక్కువగా ఉండే అవకాశం ఉందని.. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, గాలివానలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. విశాఖపట్నం లో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 32°C ఉండొచ్చు, తేమ శాతం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
Also Read:IPL 2025:ఎట్టకేలకు చెన్నై గెలుపు

