గుండెల్లో మంట.. కారణం అదే!

37
- Advertisement -

చాలామందికి గుండెల్లో మంట తరచూ వేధిస్తుంటుంది. ఇది గుండెపోటుకు సంకేతమని కొందరు భావిస్తుంటారు. ఎందుకంటే గుండెపోటు సంభవించే క్రమంలో కూడా గుండెల్లో మంటగా అనిపిస్తుంది. అయితే కొందరిలో ఇతరత్రా కారణాల వల్ల కూడా గుండెల్లో మంటగా అనిపిస్తూ ఉంటుంది. కొందరిలో రాత్రి పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత, నీళ్ళు త్రాగే క్రమంలోనూ, భోజనం చేసిన తర్వాత.. ఇలా ఆయా సందర్భాల్లో గుండెల్లో మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం !

ఉదయం నిద్ర లేవగానే గుండెల్లో మంటగా అనిపిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య కారణం కావొచ్చు. కాబట్టి గ్యాస్ ట్రబుల్ సమస్యను ఇంటి చిట్కాలతోనే దూరం చేసుకోవచ్చు. ఇంకా టీ, లేదా కాఫీ ఎక్కువగా తాగే వారిలో కూడా గుండెల్లో మంటగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు టీ, కాఫీ లను మితంగా సేవించాలి. భోజనం వేగంగా తినడం కూడా గుండెల్లో మంట రావడానికి ఓ కారణం. ఎందుకంటే ఆహారం వేగంగా తింటే అజీర్తి సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా గుండెల్లో మంటగా అనిపిస్తుంది. కాబట్టి భోజనం చేసే తప్పుడు బాగా నమిలి నిదానంగా తినాలని చెబుతున్నారు నిపుణులు. .

ఇంకా తినే ఆహారంలో కారం, మసాలా దినుసుల శాతం ఎక్కువగా ఉన్న గుండెల్లో మంటకు దారి తీస్తుంది. కాబట్టి కారం, ఉప్పు, మసాలా దినుసులను తగ్గించాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కివీ.. వంటి సిట్రిక్ ఆమ్లం కలిగిన పండ్లను ఎక్కువగా ఉన్నప్పుడు కూడా గుండెల్లో మంట ఏర్పడుతుంది. కాబట్టి వీటిని కూడా మితంగా తీసుకోవాలి. అయితే ఇలా ఆయా కారణాల వల్ల గుండెల్లో మంటగా అనిపించినప్పటికీ.. సాధారణ సమస్యే కదా అని తేలికగా తీసుకోవడానికి వీలు లేదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడొకసారి ఇలా గుండెల్లో మంటగా అనిపిస్తే పెద్దగా కంగారూ పడాల్సిన అవసరం లేదని, కానీ తరచూ గుండెల్లో మంటగా అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -