యూత్‌కే స్ట్రోక్‌ ముప్పు..

272
- Advertisement -

కరోనా తర్వాత ప్రజల ఆరోగ్యాల్లో పెను మార్పులు సంభవించాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది.

ఇక తాజాగా యుకేలో నిర్వహించిన అధ్యయనంలో అదే వెల్లడైంది. ముఖ్యంగా యూత్ గుండెపోటుతో మృతిచెందుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన 94వేల మందిపై ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. 55 ఏళ్ల లోపు యువకుల్లో స్ట్రోక్‌ ముప్పు 67శాతం ఉన్నట్లు తేల్చారు.

55 ఏళ్లు దాటిన వారికి కేవలం 15శాతం మాత్రమే ముప్పు ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే యువత ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారని గుర్తించారు.

ఇవి కూడా చదవండి..

విశ్వగురువా? విషగురువా..?

- Advertisement -