ప్రపంచ దేశాలు కరోనాను కట్టడిచేసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఇక ముఖ్యంగా భారత్‌లో లాక్ డౌన్‌తో కరోనాకు చెక్ పెట్టడంతో పాటు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ముఖ్యంగా డాక్టర్లు, పోలీసులు కంటిమీద కునుకు లేకుండా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లలేని పరిస్థితి వారిది.
భార్య, పిల్లలు కళ్ల ముందే ఉన్న చూడలేని దయనీయ స్ధితి. ఇలాంటి ఎన్నో ఘటనలు,ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్‌గా మారాగా తాజాగా ఓ జవాన్ తన బిడ్డను చూసేందుకు వెళ్లి కన్నీరు పెడుతున్న ఫోటో అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
కరోనా నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న బిడ్డను హృదయానికి హద్దుకుని కన్నీళ్లు పెడుతున్న జవాన్ ఫోటో అందరిని కదిలిస్తోంది. ఇంతకంటే మించిన భారం, శోకం మరోకటి ఉండదని ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్‌లో ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ హృదయాన్ని కదిలించే ఘటన అని పేర్కొన్నారు.
There is no greater grief in the world than you cannot hug your child directly.
A soldier fighting #Covid19 is forced to hug his child wrapped in a plastic cover.
He has caught the virus while protecting us. Heart melting stories around us.#TheyStayOutForYou#YouStayHomeForThem pic.twitter.com/HI5B2tX7Ld— Santosh Kumar J (@MPsantoshtrs) April 18, 2020