CPM:తమ్మినేనికి గుండెపోటు

28
- Advertisement -

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలో గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. లంగ్స్‌ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు.

గతంలోనే తమ్మినేనికి హార్ట్‌ స్ట్రోక్‌ రావడంతో స్టంట్‌ కూడా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మైల్డ్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Also Read:తినేటప్పుడు నీరు తాగుతున్నారా?

- Advertisement -