- Advertisement -
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉందని కొడాలి నాని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. నానికి గుండె సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు. కొడాలి నానికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుండగా పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
జగన్ కు అత్యంత సన్నిహితుల్లో కొడాలి నాని ఒకరు. టీడీపీ నేతలపై విరుచుకపడటంలో కొడాలి నాని స్టైలే వేరు. పరుష పదజాలంతో చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేసే నేతగా పేరు తెచ్చుకున్నారు.
Also Read;కాంగ్రెస్ నేతలను నిలదీయండి: హరీష్
- Advertisement -