ఒకే జిల్లా…గుండెపోటుతో 23 మంది మృతి

6
- Advertisement -

ఒకే జిల్లాలో 40 రోజుల్లో గుండెపోటుతో 23 మంది యువకులు మృతి చెందారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అందరూ 19 నుండి 25 ఏండ్ల లోపు యువకులు కావడంతో.. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి ఏమైనా సంబంధం ఉందా అని అధికారులని ప్రశ్నించారు సీఎం సిద్ధరామయ్య.

దీంతో మరణాల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు సీఎం సిద్ధరామయ్య. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా ఈ వార్త జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:TTD:హోటళ్లలో ధరలపై అసత్య ప్రచారం

- Advertisement -