గ్లాసు పాలలో చిటికెడు గసగసాలు..!

24
- Advertisement -

మనం ప్రతిరోజూ వంటింట్లో వాడే సుగంధ ద్రవ్యాలలో గసగసాలు కూడా ఒకటి. మసాలా దినుసులుగా వీటిని కూరల్లో వినియోగిస్తూ ఉంటాము. గసగసాలు కూరలను సువాసన భరితంగా చేసి రుచిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గసగసాలలో ఎక్సెక్టోరెంట్, సీమల్సెంట్ వంటి వ్యాధి నిరోదక కారకాలు ఉంటాయి. ఇవి శరీరానికి తగిలిన గాయాలను నయం చేయడంలో సహాయ పడతాయి. అంతే కాకుండా శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, దగ్గు వంటి వాటిని నివారిస్తాయి. గసగసాలలో ఆక్సలెట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కాల్షియం శాతాన్ని పెంచి ఎముకలు దృఢంగా తయారు కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే దంత సమస్యలను దూరం చేస్తాయి కూడా.

బరువు పెరగాలనుకుంటున్న వారు ప్రతి రోజూ గ్లాసుడు పాలలో చిటికెడు గసగసాల పొడి వేసుకొని తాగితే మంచిది. ప్రతిరోజూ ఇలా తాగడం వల్ల బరువు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గసగసాలలో కేలరీలు చాలా ఎక్కువ. కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రెండూ కలిసి బరువు పెరగడానికి సహాయపడతాయి.

ప్రతిరోజూ పాలల్లో చిటికెడు గసగసాల పొడి వేసి తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు రావు.

Also Read:ట్రెండింగ్‌లో రాజా సాబ్..మోషన్ పోస్టర్

- Advertisement -