చాలామందికి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభంకాదు. వందలో కనీసం 90 మందికి ఇది ఖచ్చితమైన అలవాటు. వేడి వేడి కాఫీ గొంతులోకి దిగితేగానీ హుషారుగా ఉండలేరు. అయితే కాఫీకి సంబంధించి ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది.
కాఫీ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. కాఫీలోని కెఫీన్‌తో పాటు అందులో వుండే ఇతరత్రా మూలకాలన్నీ కూడా మెదడులోని హానికర ప్రోటీన్ల శాతాన్ని తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటుందని పరిశోధకులు తేల్చేశారు. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా పాలు, చక్కెరతో తయారు చేసే కాఫీకి బదులుగా తక్కువ క్యాలరీలున్న బ్లాక్ కాఫీ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
సాయంత్రం వేళల్లో నిద్ర సమస్యలతో బాధపడేవారు సాధారణ కాఫీ అంతగా తీసుకోకపోవడమే మంచిది. కానీ, ఎసిడిటి ఉన్నవాళ్లు మాత్రం బ్లాక్ కాఫీ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కూడా కాఫీని మితంగా తాగడం మంచిది. అలాగే కెఫీన్ రక్తపోటు పెరిగేలా చేస్తుంది కాబట్టి హైబీపీ బాధితులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మేలని చెబుతున్నారు.
Also Read:వినోదాత్మక చిత్రం.. జనక అయితే గనక