వంకాయ..ఇవి తెలిస్తే అసలు వదలరు!

123
- Advertisement -

కూరగాయలలో వంకాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రుచిలోనూ వంకాయ ఇచ్చే కమ్మదనం ఇతర ఏ కూరగాయ కూడా ఇవ్వదు. అందుకే దీనిని కూరగాయలకు రాజుగా చెబుతుంటారు. అయితే వంకాయను ఇష్టంగా తినే వారు ఏ స్థాయిలో ఉన్నారో.. అసలు వంకాయ కూర అంటేనే పడని వాళ్ళుగా కూడా అంతే స్థాయిలో ఉన్నారు. వంకాయతో చేసే కూరలుగాని పచ్చళ్లు గాని ఎంత రుచిగా ఉన్నప్పటికి కొందరు వంకాయ తినడానికి ఏమాత్రం ఆసక్తి చూపించారు. అలాంటి వారు వంకాయలోని లాభాలు తెలిస్తే అసలు వదలరు మరి వంకాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం !

వంకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె వంటివి అధికంగా ఉంటాయి. ఇంకా వీటితో పాటు ఫైబర్, ఫోలెట్, మాంగనీస్, పొటాషియం, వంటి కనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ పోషకాలాన్ని నిత్యం మన శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యంగా వంకాయ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలట. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం రక్తంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గిస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు కూడా తప్పనిసరిగా వంకాయను ఆహార డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు..

ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను పెంచే కారకాలు ఉండవు కాబట్టి బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు సైతం వంకాయ తప్పనిసరిగా తినాలట. ఎందుకంటే ఇది రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా నియంత్రిస్తుంది. ఇంకా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా వంకాయ ఉపయోగపడుతుంది. జుట్టు బలోపేతానికి కూడా వంకాయ ఎంతగానో ఉపయోగ పడుతుందట. కాబట్టి వంకాయను ఎవరైనా నిరభ్యంతరంగా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Also Read: జగన్ వర్సెస్ షర్మిల.. పులివెందుల ఫైట్?

- Advertisement -