చర్మ సమస్యలకు వీటితో చెక్..

54
- Advertisement -

1. తులసి ఆకు రసంలో హారతి కర్పూరం వేసి మెత్తగా నూరి ముఖం పై ఉన్న మచ్చలపై రాసుకోవాలి.15 నిముషాల తర్వాత వేడి నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.

2. స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పు ,నిమ్మరసం కలిపి స్నానం చేస్తే దురదలు,దద్దుర్లు రాకుండా ఉపశమనం పొందవచ్చు.

3. పసుపు పొడి 3 గ్రాములు , ఉసిరిక పొడి (6 గ్రాములు )గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగితే రక్తంశుద్ధి,చర్మానికి మేలు కలుగుతాయి.

4. రోజూ ఒక్క గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగితే చర్మానికి మంచిది.చర్మానికి ముడతలు రాకుండా నివారిస్తుంది.

5. తులసి ఆకు రసం , నిమ్మరసం కలిపి తాగితే గజ్జి ,తామర ,దురదలతో త్వరగా ఉపశమనం పొందవచ్చు

6. ద్రాక్ష పళ్ళను గుజ్జుగా చేసి అందులో తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాల.ఇలా చేయడం వల్ల ముఖం కాంతి వంతగా తయారవుతుంది

7. ప్రతి రోజు ఎక్కువ గ్లాసుల నీళ్ళు తాగాలి ఇలా తాగడం వల్ల శరీరం లోని బరువు తగ్గించుకోవచ్చు

Also Read:చిరంజీవి, రజనీలతో మోడీ

- Advertisement -