నరాల బలహీనత చాలామందిని వేదించే సమస్య.. ఈ సమస్య ఉన్నవాళ్ళు నలుగురితో ఆత్మవిశ్వాసంతో ఉండలేరు. ఎందుకంటే ఎవరితోనైనా మాట్లాడే క్రమంలో కళ్లలోనుంచి నీరు కారడం లేదా మాటలు తడబాటుకు గురి కావడం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా కళ్ళు చేతులు వణకడం, తేలికపాటి బరువులను కూడా మోయలేక పోవడం.. ఇలాంటి రుగ్మతలు నరాల బలహీన ఉన్నవారిలో కనబడుతూ ఉంటాయి. అంతే కాకుండా ఒకరకమైన ఫోబియాకు కూడా గురౌతు ఉంటారు ఈ సమస్య ఉన్నవాళ్ళు. అందువల్ల నరాల బలహీనత అనేది చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఒక అతిపెద్ద సమస్య. దీని బారి నుంచి బయట పడడానికి ఎన్నో రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికి చిన్న చిన్న చిట్కాలు పాటించి కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం !
* రోజు వ్యాయామం ద్వారా నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే ఎవరు లేని చోట కూర్చొని ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చి.. అలాగే కనీసం 1-2 నిముషాల వరకు పట్టి ఉంచి ఆ తరువాత నెమ్మదిగాగ్ ముక్కు ద్వారా వదిలెయ్యలి.. ఇలా రోజుకు కనీసం 10-20 నిముషాలు చేయడం ద్వారా ఈ నరాల బలహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది.
* ఇంక మెగ్నీషియం కలిగిన పదార్థాలను అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే మెగ్నీషియం నరాలను ఉత్తేజ పరచడంలో సహాయపడుతుంది. అందువల్ల అరటిపండు, పుచ్చకాయ, పాలు.. వాల్ నాట్స్.. వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం అలవాటు చేసుకోవాలి.
*ఇంకా ఒక గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసి బాగా మరిగించి, కాస్త చల్లార్చిన తరువాత ఆ మిశ్రమానికి ఒక టీ స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే పడిగడుపున తీసుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది.
* నరాలు నొప్పి అనిపించిన చోట ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో 7 నుంచి 8 చుక్కలు పుదీనా నూనెను వేసి ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న రాసి 10 నుంచి 15 నిముషాలు మర్దనా చేయాలి ఇలా చేయడం వల్ల నరాల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇలా కొన్ని సూచనలు, చిట్కాలు పాటించడం ద్వారా వైద్య సహాయం లేకుండానే నరాల బలహీనత, నరాలపై ఒత్తిడి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Also Read:పవన్‌తో నిర్మాతల భేటీ