ఇలా చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం.. పదిలం!

33
- Advertisement -

వాతావరణంలో వస్తున్న మార్పులు, కాలుష్యం, ధూమపానం.. వంటి ఎన్నో కారణాల చేత నేటి రోజుల్లో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒక్కసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తితే ఆ తర్వాత వాటి నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. శ్వాసకోశ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఊపిరితిత్తులు చెడిపోవడం. ఎక్కువగా పొగ తాగే వారిలో లంగ్స్ చెడిపోవడం త్వరగా జరుగుతుంది. ఇంకా దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వర్క్ చేసే వారిలో కూడా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ పడుతుంది. లంగ్స్ లో ఉండే గాలి తిత్తులలో పొగబారడం, దుమ్ము చేరడం వల్ల రంద్రాలు మూసుకుపోతాయి. తద్వారా శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడతాయి.

లంగ్స్ చెడిపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, ఆస్తమా.. ఇలా చాలా ఎన్నోఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి లంగ్స్ ను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది ఊపిరితిత్తుల సంరక్షణ కోసం మెడిసిన్ వాడుతుంటారు. అయితే మెడిసిన్ తో కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల సంరక్షణకు యోగా ఎంతో మేలు చేస్తుందట.

ప్రతిరోజూ ఉదయం ధ్యానం చేయడం శ్వాసను అదుపులో ఉంచుకోవడం చేస్తూ యోగాలో సుఖసనం, మత్యాసనం, అర్థ మత్స్యేంద్రసనం వంటివి సాధన చేయాలి. వీటి ద్వారా లంగ్స్ పనితీరు మెరుగుపడుతుంది. అల్లం, వెల్లుల్లి పసుపు వంటివి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లంగ్స్ ను డిటాక్స్ గా చేస్తాయి. ఇంకా ఆ ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన పొగ, దుమ్ము, ధూళిని తొలగించి వాయు నాళాలను శుభ్రం చేస్తాయి. లంగ్స్ రంద్రాల్లో ఉండే వ్యర్థాలను కరిగించడంలో వేడినీటి ఆవిరి ఎంతగానో ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పడితే ఊపిరితిత్తుల్లో ఉండే దుమ్ము, ధూళి, కరిగిపోతుందట. అల్లం టీ, సొంటి టీ.. వంటివి కూడా ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:‘శ్వాగ్’..ఆకట్టుకోవడం పక్కా: హసిత్ గోలి

- Advertisement -