శరీరంలోని మలినాలను, వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్రీలు కీలకపాత్ర పోషిస్తాయి. కొన్ని ఆహార పదార్థాలను దూరం చేసుకుంటే కిడ్నీ సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అనేది అధిక రక్తపోటుకు కారణం అవ్వడమే కాదు కిడ్నీ సమస్యలకు కారణం అవుతుంది.
అలాగే ఇన్స్టంట్ నూడుల్స్, చిప్స్, రెడీ టు ఈట్ లాంటి పదార్థాలు సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. పప్పుధాన్యాలు, తృణధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ముప్పు తగ్గుతుందని నిపుణులు వివరిస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌లో షుగర్, కార్బోనేటేడ్ వాటర్ అధిక మొత్తంలో ఉంటాయని కాబట్టి వీటిని దూరంగా పెట్టడం మంచిది.
శరీరానికి ప్రొటీన్ తప్పనిసరి అయినప్పుటికీ రెడ్ మీట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల యూరియా, క్రియాటిన్ ఉత్పత్తి పెరుగుతుందని, వీటిని తొలగించడానికి మూత్రపిండాలకు ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పదేపదే ఉపయోగించిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఒబెసిటీ, రక్తపోటు సమస్యలు వేధిస్తాయని, దీర్ఘకాలంలో ఈ సమస్యలు మూత్రపిండాల ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కిడ్నీల ఆరోగ్యంపై దృష్టి సారిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:KCR:సంక్రాంతి శుభాకాంక్షలు

