తలలో పేలు.. తగ్గించండిలా!

26
- Advertisement -

కొంతమందికి తలలో పేల సమస్య విపరీతంగా ఉంటుంది. పేల కారణంగా చాలమంది నలుగురిలో ఉండడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వాటి కారణంగా తరచూ నెత్తిపై దురద, చెమట, దుర్వాసన.. వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. నెత్తిలో పేలు ఎక్కువగా ఉండడం వల్ల జుట్టుకూడా బాగా పలుచగా మారి రాలిపోతుంది. ఈ విధంగా పేల కారణంగా చాలానే సమస్యలు ఏర్పడుతాయి. అయితే ఈ పేల బారి నుంచి బయటపడేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా హెయిర్ ఆయిల్, రకరకాల రసాయన క్రీమ్స్ వంటివి వాడుతుంటారు. అయితే రసాయన అయిల్స్ వాడడం కన్నా సహజసిద్దమైన చిట్కాలు పేలను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..

పేల సమస్య అధికంగా ఉన్నప్పుడూ తలను శుబ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అపరిశుబ్రంగా ఉండడం వల్ల పేలు మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే వారంలో రెండు లేదా మూడు సార్లు తల స్నానం చేయాలి. ఇంకా పేల సమస్యను తగ్గించడంలో పెరుగు నిమ్మరసం ఎంతగానో సహాయపడతాయి. అందువల్ల పెరుగు నిమ్మరసం కలిపి తలకు పట్టించుకుని అరగంట తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే పేలు తగ్గిపోతాయి.

ఇంకా వేపాకు, తులసి ఆకులను పేస్ట్ లా దంచుకొని ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు, కొబ్బరి నూనె కలిపి మాడుకు తగిలేలా పట్టించి మర్దన చేయాలి. ఆ తర్వాత ఒక అరగంట ఆగి స్నానం చేస్తే పేలు తగ్గడంతో పాటు చుండ్రు కూడా దూరమౌతుంది. ఇంకా జుట్టు నిగారింపు సొంతం చేసుకొని దృఢంగా మారుతుంది. ఈ చిట్కాలు మాత్రమే కాకుండా సిట్రిక్ ఆమ్లం కలిగిన పండ్లు అనగా నిమ్మ, ఆరెంజ్, దానిమ్మ వంటివాటిని ఆహార డైట్ లో చేర్చుకుంటే జుట్టు సంక్రక్షణకు ఎంతో మంచిది. ఇలా సహజసిద్ధంగానే పేలు, ఇతరత్రా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Also Read:Congress:కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.. షురూ!

- Advertisement -