ఈ మద్య చాలమందిని గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు వేధిస్తున్నాయి. టైమ్ కి భోజనం చేయకపోవడం, తినే ఆహారంలో మసాలా ఎక్కువగా వాడడం, వంటి కారణాల చేత గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. సాధారణంగా పండుగ సమయాల్లో పిండి వంటలు, రకరకాల ఆహార పదార్థాలు చేస్తూ ఉంటారు. వీటిని చూసినప్పుడు నోరు ఊరుతుంది. తద్వారా కంట్రోల్ తప్పి అమితంగా తింటూ ఉంటాము. ఇలాంటి సమయాల్లో కూడా గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు చాలమంది ట్యాబ్లెట్స్ వేసుకోవడం, లేదా డాక్టర్స్ రాసిచ్చిన మెడిసన్ వేసుకోవడం వంటివి చేస్తుంటారు.
కానీ ఉదర సంబంధిత సమస్యలకు ఇంటి చిట్కాలే అద్బుతంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిని బాగా మరిగించి చల్లార్చిన తరువాత ఆ నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి భోజనానికి ముందు లేదా భోజనం చేసిన తరువాత సేవిస్తే గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఒక టీ స్పూన్ తేనె మరియు పెరుగు కలిపి భోజనం అనంతరం తీసుకున్న జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
తద్వారా ఉదర సంబందిత సమస్యలు తగ్గిపోతాయి. రెండు టీ స్పూన్ ల నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి రాత్రి భోజనం తరువాత పడుకునే ముందు సేవించిన మంచి ఫలితం ఉంటుంది. ఇంకా గ్యాస్ సమస్యలను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల గ్యాస్ బాగా ఉంటే అల్లం టీ తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా పుదీనా రసం, బేకింగ్ సోడా, నిమ్మరసం వంటి మిశ్రమలు కూడా గ్యాస్ ను దూరం చేస్తాయి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, వంటివి తిన్న గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది.
Also Read:నల్ల ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో!