వేసవి వేడి నుండి ఉపశమనం కలిగించడంలో సాయపడే ఆహారంలో ఒకటి చద్దన్నం. రాత్రిపూట అన్నం మిగిలితే అందులో పాలు, నీళ్లు పోసి తోడు పెట్టి చద్దన్నం చేయడమే. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చో నంజుకొని తింటే అల్పాహారం పూర్తవుతుంది. ఇంకా కొందరేమో మిగిలిన అన్నాన్ని మర్నాడు పోపన్నంగా చేసుకొని తింటుంటారు.
చద్దన్నంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.పేగులు ఆరోగ్యంగా ఉండటానికి, రక్తంలో గ్లూకోజు మోతాదుల నియంత్రణకు, చివరికి బరువు తగ్గటానికీ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట నీటిలో లేదా తోడు పెట్టిన పాలలో అన్నాన్ని వేసినప్పుడు అది కాస్త పులుస్తుంది. దీన్ని ఉదయాన్నే తింటే శరీరానికి చలువ చేస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి, దాహం వేయకుండానూ చూస్తుంది.
చద్దన్నంతో పాటు ఉల్లిపాయనూ నంజుకుంటే.. శరీరానికి తగినంత పీచూ లభిస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిజేరదు. పులిసిన ఆహారం కావటం వల్ల మానసిక ఆందోళనా తగ్గుతుందిని నిపుణులు చెబుతున్నారు.
Also Read: రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం:పొంగులేటి

