పన్నీరు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

92
- Advertisement -

భారతీయులు అత్యంత విరివిగా ఉపయోగిచే వంటింటి పదార్థాలలో పన్నీరు ముందు వరుసలో ఉంటుంది. పన్నీరుతో రకరకాల వంటలను తయారు చేస్తుంటారు. బటర్ పన్నీర్, పన్నీరు దోశ, పన్నీరు టిక్కా.. ఇలా పన్నీరుతో చేసిన ఎన్నో వంటలు రుచిలో కొత్తదనాన్ని అందిస్తాయి అయితే వంటల్లో పన్నీరు వాడడం అంతా మంచిది కాదని కొందరిలో అపోహ ఉంది. పన్నీరు కారణంగా అజీర్తి, అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయని కొందరు పన్నీరు వాడకానికి దూరంగా ఉంటారు. .

అయితే వంటల్లో పన్నీరు ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనలు తెలిస్తే అసలు వదలరు. పన్నీరులో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మనశరీరానికి పోషణ మరియు శక్తి రెండిటినీ అందజేస్తాయి. పన్నీరులో ఉండే మెగ్నీషియం రక్తంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండెకు ఆరోగ్యాన్ని అందజేస్తాయి. పన్నీరులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుదల బాగా జరుగుతుంది.

ముఖ్యంగా గర్భిణీలకు పన్నీరులో ఉండే విటమిన్ బి12 మరియు ఫోలిక్ యాసిడ్ చాలా బాగా ఉపయోగ పడతాయట. ఎందుకంటే గర్భంలోని శిశువుకు మంచి పోషణ అందించడంలో ఇవి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పన్నీరులో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి కండరాలకు మంచి పుష్టి కలుగుతుంది. బలహీనంగా ఉన్నవాళ్ళు తినే ఆహారంలో పన్నీరు ఉండేలా చూసుకుంటే కండరనిర్మాణం బాగా జరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇంకా పన్నీరులో ఉండే జింక్, సెలీనియం వంటివి ఈ వర్షాకాలంలో వచ్చే ఫ్లూ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు వంటి వాటిని ఎదుర్కొని ఇమ్యూనిటీని పెంచుతాయట. అందుకే పన్నీరు వాడకంపై నిర్లక్ష్యం వహించవద్దని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలిగిన పన్నీరును వాడడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఏపీ ఓటాన్ బడ్జెట్.. ప్రత్యేకతలివే !

- Advertisement -