తెల్ల జుట్టు..ఇలా చేస్తే నల్లగా!

8
- Advertisement -

నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు సమస్య వేధిస్తుంది. చిన్నపిల్లల్లోనూ జుట్టు నెరసిపోవడం సర్వసాధారణం అయింది. అయితే కొందరిలో ఈ తెల్ల జుట్టు సమస్య జన్యు పరమైన లోపం వల్ల సంక్రమిస్తే.. మరికొందరిలో పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. అయితే చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల ఏదైనా అనారోగ్యానికి సంకేతమా అని చాలమంది భయపడుతుంటారు.

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక పదార్థాలను ఆహార డైట్ లో చేర్చుకోవాలి. జుట్టు సంరక్షణకు గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడ్డులోని ప్రోటీన్లు జుట్టుకు బలాన్ని చేకూర్చి తెల్ల జుట్టును దూరం చేస్తాయి. పాలు,పెరుగు,మాంసం,గుడ్లు,ఆకుకూరలు,గింజ ధాన్యాలు,ఎండు ద్రాక్షాలు,ఒమెగా 3 యాసిడ్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సాయ పడతాయి.

జుట్టుకు తరచూ నూనె పెట్టడం, మాడును మసాజ్ చేయడం మంచిది. ఉసిరి పొడి, మందార తైలం, కరివేపాకు, వేప నూనె, శీకకాయ లాంటి సహజ సిద్ధమైన పదార్థాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

Also Read:Harishrao: కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్

- Advertisement -