నిమ్మరసంతో ఆరోగ్య ప్రయోజనాలు…

157
- Advertisement -

గ్గాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మ చెక్క కలుపుకొని తాగడం వల్ల కొన్ని రకల ప్రయోజనలు ఉన్నాయి. శుభ్రమైన నీటిని మరగించి తాగే వేడి వరకు చల్లార్చాలి. అర గ్లాస్ నీటిలో నిమ్మచెక్క రసం పిండాలి. గింజలు తేకుండా చూడాలి. చక్కర తదితర తీపి కారకాలను కలపకుండా పరిగడుపున తాగాలి. తరువాత గంట విరామం ఇచ్చి బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే దిగువన పెర్కొన్న ప్రయోజనాలు కలుగుతాయి.

1. కాలేయం శుభ్రపడటంతో పాటు పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం మరిన్ని ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది

2.ఆహారం సులభంగా జీర్ణమవుతుంది .మలబద్దకం తగ్గి మోషన్ ఫ్రీగా అవుతుంది.

3. నిమ్మ రసం రక్తంలో త్వరగా కలిసిపోయి అన్ని అవయవాలు చరుగ్గా పనిచేసేలా చేస్తుంది. భోజనానికి ముందు నిమ్మరసం తాగడం వల్ల పి హెచ్ స్ధాయిలు పెరుగుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగి శరీర వ్యాధులను సమర్ధంగా ఎదుర్కొంటుంది.

4. నిమ్మ రసం యూరిక్ యాసిడిను పలుచనచేసి కీళ్ళనొప్పులు, గౌట్స్ వంటి రుగ్మతలబారిన పడే అవకాశలను తగ్గిస్తుంది.

5.నోటిలో బాగా లాలాజలం ఊరుతుంది.అందువల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.

6.శరీరంలో కఫాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.

7.నిమ్మరసం పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి.ఇది సోడియంతో కలిసి మెదడు ,నాడీ వ్యవస్ధల పనితీరును మెరుగు పరుస్తుంది.రక్తంలో పొటాషియం నిల్వలు తగినన్ని ఉంటే మానసిక ఆందోళన ఒత్తిడి , మందకొడితనం , మతిమరపు వంటి సమస్యలు రాకుండా వుంటాయి, గుండే పనితీరు మెరుగు పడటంతో పాటు మెదడు చురుగ్గా పని చేస్గుంది.స

8.రక్తంలో నిమ్మరసం కాల్షియం ,మెగ్నీషియం నిల్వలు సమృద్దిగా ఏర్పడతాయి.తగినంత స్థాయిలో కాల్షయం ఉండటం వల్ల రికెట్స్ వ్యాధి సోకే అవకాశం ఉండదు ,మెగ్నీషియం గుండెకుచాలా మంచిది.అతి సులువైన ఈ పద్ధతి వల్ల తేలిగా ఆరోగ్యన్ని కాపాడుకోవచ్చు. పరిగడుపున క్రమం తప్పకుండా నిమ్మరసం తాగాలి.

Also Read:‘ధీమహి’ … ఫస్ట్ లుక్

- Advertisement -