పొద్దుతిరుగుడుతో ఈ సమస్యలు దూరం..

372
- Advertisement -

పొద్దు తిరుగుడు అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. సాధారంగా మనం పల్లీ నూనెతో పాటు పొద్దు తిరుగుడు విత్తనాల నూనెను కూడా వంటకాల్లో ఉపయోగిస్తుటాం. అయితే కేవలం పొద్దు తిరుగుడు విత్తనాల నూనె కాదు.. పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆకులు, వేరు కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.జీర్ణశక్తి లోపించిన వారు ప్రతి రోజు ఉదయం పొద్దు తిరుగుడు గింజల నూనెను తగిన మోతాదులో తీసుకుంటే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. పొద్దు తిరుగుడు చెట్టు ఆకులు, బొప్పాయి చెట్టు ఆకులను కలిపి, ఆకుకూరలా వండి, రోజుకు రెండు పూటలు తింటే శరీరంలో అధికమైన చెడు నీరు పోయి ఉబ్బు రోగం నుంచి ఉపశమనం పొందవచ్చు.

Also Read:KTR : కోల్‌కతా డాక్టర్‌ ఘటనపై కేటీఆర్‌

పొద్దు తిరుగుడు చెట్టు ఆకును తేలు కుట్టినప్పుడు మెత్తగా నూరి వాసన చూడాలి. వాసన చూసిన అనంతరం తేలు విషం నశించిపోయి నొప్పి, మంట వెంటనే తగ్గిపోతుంది. పొద్దు తిరుగుడు చెట్టు ఆకులను మెత్తంగా నూరి రాత్రి సమయంలో కాళ్ల పగుళ్లకు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

- Advertisement -