మన శరీరంలో ఉన్న ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి.. ఈ గ్రంథి మన శారీరక ఎదుగుదలలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ గ్రంథిలో ఏర్పడే అసమతుల్యత కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయి. దాంతో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, ఒల్లంత చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేక పోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం..వంటి ఎన్నో సమస్యలు చుట్టూ మూడతాయి. అయితే ఈ థైరాయిడ్ గ్రంథిని సమతుల్యంగా ఉంచేందుకు యోగాలో కూడా చక్కటి మార్గాలు ఉన్నాయి. యోగాలోని సర్వంగాసనం ద్వారా థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం ద్వారా థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది..
అంతే కాకుండా థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి పనితీరును మెరుగు పరుచుతుంది. అందువల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి సర్వంగాసనం ఒక వరంలా పని చేస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సర్వంగాసనం వల్ల కేవలం థైరాయిడ్ సమస్యలు మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల ఆరోగ్య సమస్యలను కూడా నియంత్రిస్తుందట. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల లివర్, ప్లీహం రుగ్మతలనుంచి బయటపడవచ్చు. అలాగే పురుషులలో వీర్య కణాల వృద్దిని పెంచుతుంది. మలబద్దకం, అజీర్తి, మూలవ్యాది, వంటి వాటిని తగ్గించడంతో పాటు.. స్త్రీలలో ఋతు సమస్యలను, వివిధ రకాల చర్మ వ్యాధులను తగ్గించడంలో కూడా సర్వంగాసనం అద్బుతమైన పని తీరును కనబరుస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
గమనిక : గర్భిణీలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు.
ఇవి కూడా చదవండి..