సీజనల్ ‘రేగుపండ్లు’తో ప్రయోజనాలు!

122
- Advertisement -

రోజురోజుకూ చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఇక ఈ చలికాలంలో సీజన్ ను బట్టి ప్రకృతి ప్రసాధించే పండ్లలో రేగుపండ్లు కూడా ఒకటి. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ రేగుపండ్ల చెట్లు ప్రతిచోటా కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో ఏక్కువగా కనిపించే ఈ రేగుపండ్లను అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కాస్త తీపి, కొసింత పులుపు.. ఇంకోచం ఒగురు ఇలా ఆయా రుచులు కలగలిపి ఉండే ఈ రేగు పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. రేగుపండ్లలో ఉండే అమినోయాసిడ్స్ రక్త హీనతను గట్టించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎండు రేగుల్లో ఉండే కాల్సియమ్, ఫాస్ఫరస్ ఎముకలు దృఢంగా తయారవడానికి సహకరిస్తాయి. .

ముఖ్యంగా కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ సీజనల్ రేగుపండ్లను తింటే చక్కటి పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మలబద్దకం వంటి సమస్యలను కూడా రేగుపండ్లు చెక్ పెడతాయట. మానవశరీరానికి కావల్సిన 24 రకాల అమినోయాసిడ్స్ లలో 18 రకాలు కేవలం రేగుపండ్ల నుంచే లభిస్తాయట. ఇక రేగుపండ్ల తినడం ద్వార ఆయా రకాల ఆరోగ్య సమస్యలు కూడా తొలిగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంట, అజీర్తి, గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించడంలో రేగు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గర్భిణిలలో వచ్చే వికారం, వాంతులను కూడా రేగుపడ్లు తగ్గిస్తాయట. అందువల్ల సీజనల్ గా ప్రకృతి ప్రసాదంగా దొరికే ఈ రేగుపండ్లను అందరూ తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:మెట్లు ఎక్కండి…ఇలా బరువు తగ్గండి!

- Advertisement -