అల్లం ఛాయ్ తర్వాతే మరేదైనా….

434
zunger tea
- Advertisement -

చలికాలం, వర్షా కాలంలో చల్లటి వాతావరణం నుంచి శరీరానికి మంచి ఉపశమనంగా పనిచేయడంలో అల్లం ఛాయ్ తర్వాతే మరేదైనా అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.

అంతేకాదండోయ్‌.. ఆరోగ్యం రీత్యా అల్లం ఛాయ్‌తో కలిగే లాభాలు కూడా చాలానే ఉన్నాయట. అల్లం ఛాయ్‌లో వుండే సీ విటమిన్, మ్యాగ్నీషియంతోపాటు ఇతర మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లం ఫ్లేవర్‌తోపాటు ఛాయ్‌లో పూదీనా కానీ లేక నిమ్మరసం కానీ లేక తేనె వంటివి కూడా మిశ్రమంగా కలుపుకోవచ్చు..

తల తిప్పడం, వాంతులకి చెక్ పెట్టే అల్లం ఛాయ్:

ప్రయాణం సమయంలో కొంతమంది తల తిప్పడం, వాంతులు రావడం వంటివి జరుగుతుంటాయి. అయితే, ప్రయాణానికి ముందుగా ఒక కప్పు అల్లం ఛాయ్ తీసుకుంటే ఇక వాంతులు, తల తిప్పడం వంటివి దరిచేరవు.

జీర్ణశక్తి:
జీర్ణ ప్రక్రియకు దోహదపడే సద్గుణాలు అల్లం ఛాయ్ సొంతం. అమితంగా ఆహారం తీసుకుని ఇబ్బంది పడే సమయాల్లో ఓ కప్పు అల్లం ఛాయ్ తీసుకుంటే అజీర్తి సమస్య వుండదు.

కీళ్ల వాతం, కండరాల నొప్పికి చెక్:

కీళ్ల వాతం, కండరాల నొప్పికి అల్లం ఛాయ్‌తో చెక్ పెట్టవచ్చు. అల్లంలో వుండే ఔషదాలు ఈ కీళ్ల వాతం, కండరాల నొప్పిని తగ్గించడానికి మేలు చేస్తాయి.

శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి మెడిసిన్:

శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ అల్లం టీ ఓ చక్కటి ఔషదంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జలుబు వేధించే సందర్భాల్లో కనుక ఈ అల్లం ఛాయ్ తీసుకున్నట్టయితే.. గొంతు, ముక్కు పట్టేయడం వంటి వాటి నుంచి శీగ్ర ఉపశమనం పొందవచ్చు.

మెరుగైన రక్తం సరఫరా :

రక్తం సరఫరా సమస్యలతో బాధపడేవారికి అల్లం ఛాయ్ కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అళ్లంలో వుండే విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ రక్త సరఫరాని పెంచడంతోపాటు హృదయ సంబంధిత సమస్యలని తగ్గిస్తాయి.

నెలసరి సమస్యలకి ఉపశమనం:
నెలసరి సమయంలో సమస్యలు ఎదుర్కునే మహిళలకి అల్లం ఛాయ్ తీసుకుంటే కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. గోరు వెచ్చగా వుండే అల్లం ఛాయ్‌లో ఓ బట్టని అద్ది పొత్తి కడుపు కింది భాగంలో మర్ధనలా చేస్తే నెలసరి కారణంగా కలిగే నొప్పుల నుంచి ఉపశనమం లభిస్తుంది. అదే సమయంలో ఓ కప్పు అల్లం ఛాయ్‌లో కొంత తేనే కలుపుకుని తీసుకుంటే మరీ మంచిది.

వ్యాధి నిరోధక శక్తి:
అల్లం ఛాయ్ వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి మేలు చేస్తుంది. అల్లంలో అధిక మొత్తంలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ అందుకు కారణం.

ఒత్తిడిని తగ్గిస్తుంది:
మానసిక, శారీరక ఒత్తిడిని జయించడానికి సైతం అల్లం ఛాయ్ ఉపయోగపడుతుంది. అల్లంలో వుండే ఔషదాలు, యాంటీ ఆక్సిడెంట్సే ఒత్తిడిని తగ్గించేందుకు కృషిచేస్తాయి.

Also Read:Sukumar:సుక్కు నెక్ట్స్ ఎవరితో?

- Advertisement -