వంటింట్లో ఉపయోగించే పదార్థలలో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి, వీటిని కూరలలోనూ, చట్నిల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. మెంతులు కూరల రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి, అందుకే ఆయుర్వేదంలో కూడా మెంతులను ఉపయోగిస్తూ ఉంటారు. మెంతులలో రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కూరలలో మెంతులను ఉపయోగించడం వల్ల శరీరానికి అదనపు ప్రయోజనాలు కలుగుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే మెంతులను కేవలం కూరలలో మాత్రమే కాకుండా వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం, లేదా నేరుగా మెంతులనే తినడం చేస్తుంటారు కొంతమంది.
ఇలా మెంతులను నేరుగా తింటే మరి మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం పూట పడగడుపున కొన్ని మెంతులను తింటే జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందట. ఇంకా గ్యాస్, ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే రైబోఫ్లేవిన్ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుందట. కాబట్టి మెంతి గింజలను నేరుగా తినడం మంచిదే. కఫం, దగ్గు, ఆస్తమా ఉన్నవారు మెంతి గింజలను తినడం లేదా మెంతులు నానబెట్టిన నీరు త్రాగితే ఆ సమస్యలన్నీ దూరమవుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు నానబెట్టిన మెంతులను ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం తినడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, టాక్సిన్ లు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. తద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. కాబట్టి మెంతులను తినడం మంచిదే అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే వీటిని అధికంగా తినరాదని, తగు మాత్రమే తినాలని సూచిస్తున్నారు, ఎందుకంటే వీటిని అధికంగా తినడం ద్వారా శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. అలాగే విరోచనాలు మైకం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయట.
Also Read:తెరపైకి కేబినెట్ విస్తరణ..ఆ 6గురు ఎవరు?