ఎండ తీవ్రత అధికంగా ఉంది, రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చల్లని నీళ్ల కోసం జనాలు తహతహలాడుతుంటారు. అయితే పెరిగిన ఎండలకు చల్లని నీరు తప్ప వేరే నీరు గొంతులోకి దిగకపోవడంతో ఎక్కువ మంది ఫ్రిజ్ వాటర్‌ను తీసుకుంటారు. కానీ ఫ్రిజ్ వాటర్ కంటే కుండలోని నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు కేవలం మట్టికుండల్లోని నీటిని మాత్రమే తాగేవారు. దాంతో మనకు దాహం తీరడమే కాదు, అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి కుండ నీటి వల్ల కలిగే లాభాలు ఎంటో చూద్దాం..
1.మట్టికుండలో నీటిని తాగితే గొంతుకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. గొంతు ఇన్ఫెక్షన్లు, నొప్పి ఉన్నవారు కుండల్లో నీటిని తాగడం మంచిది.
2.అధిక బరువుతో బాధపడేవారు మట్టికుండల్లో నీటిని తాగడం మంచిది. దాంతో బరువు తగ్గుతారు.
3.మట్టి ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దాంతో తయారు చేసిన కుండలో నీటిని పోస్తే ఆ నీరు కూడా ఆల్కలైన్ స్వభావాన్ని పొందుతాయి. ఈ క్రమంలో ఆ నీటిని తాగితే మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి.
4.మట్టికుండలో నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం రేటు క్రమబద్దీకరించబడుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.