అవకాడోతో ఆరోగ్యం

88
- Advertisement -

రోజులు మారుతున్న కొద్ది మన అలవాట్లలో కూడా చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఉదయం నిద్ర లేవగానే కల కృత్యాలు తీర్చుకొని ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఎంతో చురుకుగా, ఉల్లాసంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉదయం నిద్ర లేచినది మొదలు మళ్ళీ పడుకునే వరుకు బద్దకం, అలసట, నీరసం వంటి వాటితో రోజును గడిపేస్తున్నాము. ఇంకా చెప్పాలంటే మన పనులు మనం చేసుకోవడానికి కూడా అలసటగా భావిస్తుంటాము. అయితే ఇవన్నీ దూరం చేసుకోవాలంటే రోజంతా యాక్టివ్ గా పని చేయాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది.

ఇక ముఖ్యంగా రోజువారి డైట్‌లో ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఆవకాడో ఉంటే చాలా బెటర్. ఎందుకంటే ఈ పండులో చాలా రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. అవకాడో ఒక సూపర్ ఫుడ్ ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల పెరిగిన బరువు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇవి శరీరానికి ఎటువంటి హాని కలిగించవు.

గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. నెల రోజుల పాటు రోజూ ఒక అవకాడో తింటే అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ కంటి చూపు బలహీనపడినట్లయితే ప్రతిరోజూ అవకాడో తినడం ప్రారంభించండి. ప్రతిరోజూ తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

Also Read:BRS:నల్గొండ బీఆర్ఎస్ నేతల అరెస్ట్

- Advertisement -