- Advertisement -
లాక్ డౌన్ నేపథ్యంలో సహనం నశించిన పోలీసులు లాఠీలకు పని చెబుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా యూపీలో పోలీసులే కొట్టున్నారు.
లాక్ డౌన్ సమయంలో సరిగా డ్యూటీ చేయలేదని మందలించిన ఎస్‌ఐపై లాఠీతో దాడిచేశాడు ఓ హెడ్ కానిస్టేబుల్. వివరాల్లోకి వెళ్తే..సీతాపూర్ జిల్లాలోని కొత్వాలీ పోలీస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామశరాయ్ సరిగా తనిఖీలు చేయడం లేదని మందలించాడు ఎస్సై రమేష్. దీంతో ఆగ్రహించిన రామశరాయ్….ఎస్సై రమేష్‌పై లాఠీతో దాడిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఉన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు.
- Advertisement -