- Advertisement -
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ మద్దతు పలికారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని అభినందించారు. యుద్ధం కొనసాగించాలని కేసీఆర్‌కు సూచించారు. కేసీఆర్‌కు ఫోన్ చేసిన దేవేగౌడ దేశ లౌకికవాద సంస్కృతిని కాపాడుకునేందుకు అంతా అండగా వుంటామన్నారు. కేసీఆర్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా.. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దేవేగౌడకు తెలిపారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది.
- Advertisement -