- Advertisement -
ఇప్పటివరకు పెట్రోల్,డీజీల్,వంటనూనె,గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు ద్రవ్యోల్బణం బాత్‌రూమ్‌ని తాకింది. తాజాగా సబ్బులు మరియు షాంపూల ధరలు పెరిగాయి. హెచ్‌సీఎల్ తన ఉత్పత్తుల ధరలను 15 శాతం వరకు పెంచింది. టూత్‌పేస్ట్, కెచప్ వంటి ఇతర వస్తువుల ధరలను కూడా హెచ్‌సీఎల్ పెంచింది.
ప్రస్తుతం క్లినిక్ ప్లస్ షాంపూ 100 మిల్లీమీటర్ల ప్యాక్ ధర 15శాతం పెరగ్గా.. ఇతర షాంపూల ధరలు పెరిగాయని డిస్ట్రిబ్యూటర్ వర్గాలు తెలిపాయి. హిందూస్థాన్ యూనిలీవర్ సబ్బులు, షాంపూల ధరలను మాత్రమే కాకుండా కంపెనీ తయారు చేసే పలు ఉత్పత్తుల ధరలను సైతం పెంచేసింది. వీటిలో హార్లిక్స్, బ్రూ కాఫీ, కిసాన్ కెచప్ ఉన్నాయి.
ఆర్బీఐ బుధవారం రెపో రేట్లను పెంచగానే.. దేశంలోని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. దీని ప్రభావం ధరల పెరుగుదలకు కారణమైంది.
- Advertisement -