కొనసాగుతున్న హెచ్‌సీఏ ఎన్నికల పోలింగ్..

588
hca
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 225 మంది సభ్యులు ఉండగా అధ్యక్ష పదవి కోసం అజారుద్దీన్, దిలీప్ కుమార్, ప్రకాష్ చంద్ జైన్ పోటీ పడుతున్నారు.వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం జాన్ మనోజ్, సర్దార్ దల్దీత్ సింగ్ పోటీపడుతున్నారు.

హెచ్‌సీఏలో ఓటు హక్కు ఉన్న భారత మాజీ క్రికెటర్లు అజారుద్దీన్, లక్ష్మణ్, వెంకటపతి రాజు, శివాలాల్ యాదవ్, ఆర్షద్ ఆయుబ్, నోయల్ డేవిడ్, సాండ్రా బ్రగాంజా, రజని వేణుగోపాల్, పూర్ణిమా రావు, డయానా డేవిడ్ ఉన్నారు.మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇక గత హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు ఈ సారి ఎన్నికల్లో వివేక్ కు చుక్కెదురైంది. జి.వివేక్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతి అక్రమాలపై హైకోర్టులో కేసు ఉన్నందున ఆయన నామినేషన్ చెల్లదని అధికారులు పేర్కొన్నారు. హెచ్ సీఏలో 5 పదవులకు మొత్తం 72 నామినేషన్లు రాగా, 9 మంది వివిధ కారణాలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

- Advertisement -