వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్.. రజినీకాంత్

35
- Advertisement -

సౌత్ వెండితెరకు విలన్ గా పరిచయమైన శివాజీరావు గైక్వాడ్ అంచెలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ అయ్యారు, అనతి కాలంలోనే జపాన్ లోనూ సూపర్ హీరో అయ్యారు. రజినీకాంత్ అనే పేరుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆర్శప్రాయం. మేనరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్. నేడు ఆయన పుట్టిన రోజు. 1975లో అపూర్వ రాగంగళ్ సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించారు.

పైగా ఏడు ప‌దుల వ‌య‌స్సులో కూడా ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్, మ‌రిన్ని మంచి సినిమాల‌తో మ‌న‌ల్ని అల‌రిస్తూ, ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని మా ‘గ్రేట్ తెలంగాణ.కామ్’ మ‌న‌సారా కోరుకుంటుంది. కొందరు ప్రముఖులు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, జీవితంలో మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అని గతంలో రజినీతో దిగిన ఫోటోని షేర్ చేశారు.

అలాగే అభిమానులు కూడా రజనికి ప్రత్యేక విషెస్ చెబుతున్నారు. మాకు అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన మా హీరోకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ అభిమాని ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశాడు. సూపర్ స్టార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని మరో అభిమాని సంఘం లీడర్ రజనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సూపర్ స్టార్ గా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు రజని. ఆయన ఎప్పుడూ బాగుండాలని ఆయనకు ప్రత్యేక బర్త్ డే విషెస్ చెబుదాం.

Also Read:TTD:17 నుండి తిరుప్పాపై పారాయ‌ణం

- Advertisement -