- Advertisement -
టీమిండియా పేసర్ మహ్మాద్ షమి అతని భార్య హసీన్ జహాన్ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. షమి ఓ ఫిక్సర్ అని..అతనికి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు సంచలన ఆరోపణలు చేసింది. దీనికి ఘాటుగా బదులిచ్చిన షమి…జహాన్‌కు పెళ్లైన విషయం దాచిపెట్టి తనను మరో పెళ్లి చేసుకుందని ఆరోపించాడు.
వీరిద్దరు రోజుకో బాంబ్ పేలుస్తుండగానే తాజాగా జహాన్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 23న దీదీని కలిసి తాను ఎదుర్కొంటున్న దుస్థిని వివరిస్తానని తెలిపింది. తనను చంపే కుట్ర జరుగుతోందని….షమిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
అయితే,సోమవారమే మమతను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని అధికారులను కోరినా…మమతా అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగింది. జహాన్ ఆరోపణల నేపథ్యంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
- Advertisement -