జిమ్‌ చేస్తుండగా ఎన్టీఆర్‌కు గాయం..!

64
ntr
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన తన ఇంట్లో జిమ్‌ వ్యాయామాలు చేస్తుండగా కుడిచేతి వేలుకి గాయమైనట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల క్రితమే ఎన్టీఆర్‌ మైనర్ సర్జరీ చేయించుకున్నారు. కొన్ని రోజుల పాటు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌కు వైద్యులు సూచించారు. నిన్న ఎన్టీఆర్ త‌న కొడుకులతో కలిసి దిగిన ఫొటోలోనూ కుడి చేతికి బ్యాండేజీతో కనిపించాడు. త్వ‌ర‌లోనే ఆయ‌న కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

ఇక, ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో కు హోస్ట్‌గా చేస్తున్నాడు. అలాగే ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు రెడీ అవుతోంది. త్వరలో కొరటాల శివ దర్శ‌క‌త్వంలో రూపొందే చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాలోనూ న‌టించాల్సి ఉంది.

- Advertisement -