సోషల్ మీడియాలో.. అమ్మాయిలు జర జాగ్రత

375
Haryanvi man harassing Hyderabad woman in Facebook
- Advertisement -

సోషల్ మీడియాలో రోజు రోజుకు ఆకతాయిల ఆగడాలు పెరిగిపోన్నాయి. ఓ యువకుడు ఫేస్‎బుక్ వేదికగా ఓ అమ్మాయి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. నీ కూతురి నగ్న చిత్రాలు నా వద్ద ఉన్నాయింటూ బెదిరింపులకు పాల్పడ్డాడు గుర్గావ్‎కు చెందిన సాఫ్ట్‎వేర్ ఉద్యోగి దేవేంద్రసింగ్(25) అనే యువకుడు. నీ కూతురిని ఢిల్లీకి పంపించకపోతే ఆమె నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో 24 గంటల్లో నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.

 Haryanvi man harassing Hyderabad woman in Facebook

అసలు విషయానికి వస్తే జైపూర్‎లోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‎వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దేవేంద్రసింగ్ ఫేస్‎బుక్‎లో బాధితుడి కూతురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. యువకుడితో క్లోజ్‎గా మూవ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్ని చెప్పి నగ్న ఫోటోలను పంపించుకున్నాడు. ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో బ్లాక్ మెయిల్ చెయ్యడం ఆరంభించాడు.

నిన్ను కలవాలని ఢిల్లీకి రావాలని కోరాడు ఆ అమ్మాయి నిరాకరించడంతో వాళ్ల నాన్న మెయిల్‎కి మెసేజ్ పంపాడు. మీ అమ్మాయిని ఢిల్లీ పంపించు నాకు వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మీ అమ్మాయి ఊరి వెళ్లిన్నప్పుడు మీ ఆవిడను పంపించు వండిపెడుతుంది మెసేజ్ చేశాడు. మీ అమ్మాయిని ఢిల్లీ పంపించకపోతే నీ కూతురి నగ్న ఫోటోలను షోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ నెంబర్ నుంచి బాధితుడికి బెదిరింపు కాల్స్, మెసేజ్‎లు, మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని 24 గంటల్లో పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు.

- Advertisement -