ఏడు గ్యారెంటీలతో హర్యానా కాంగ్రెస్ మేనిఫెస్టో

5
- Advertisement -

హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏడు గ్యారెంటీలతో మేనిఫెస్టోను ప్రకటించారు.

ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ 2000, పెన్షన్ రూ 6000 వేలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు. ఖర్గేతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ తదితరులు ఉన్నారు.

18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు వారి సాధికారత కోసం నెలకు రూ. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకు, సీనియర్ సిటిజన్లకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. పాత పెన్షన్ పథకం (ఒపిఎస్) ను పునరుద్ధరిస్తామని, ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు ఖర్గే.

Also Read:బుక్‌ మై షోలో దేవర హవా!

- Advertisement -