హర్యాణా బీజేపీ చీఫ్ రాజీనామా

463
subhash barala
- Advertisement -

హర్యాణా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సుభాష్ బరాలా . ఇవాళ వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీ, కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపించారు. హర్యాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని చేపట్టడానికి సరైన ఫిగర్ ను రాబట్టలేకపోయింది.

ఇతరులను కలుపుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు, ఫలితాలు హంగ్ దిశగా వెలువడుతుండటంతో… జేజేపీ కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ జేజేపీ కలిసి అధికారం చేపట్టేందుకు సిద్దం అయినట్లు తెలుస్తుంది.

- Advertisement -