వీకెండ్ పార్టీ, డిన్నర్లు, విదేశీ పర్యటనలు, చిత్రోత్సవాలు.. కార్యక్రమం ఏదైనా వారిద్దరు ఒకేచోట కనిపిస్తారు.ఇద్దరూ ఒకే జిమ్‌లో కలిసి వ్యాయామం చేస్తారు. ఇద్దరికీ దుస్తులు డిజైన్ చేసేది కూడా ఒక్కరే. వారే జాక్వెలిన్ ఫెర్నాండజ్, సోనమ్ కపూర్. వీరిద్దరి స్నేహం గురించి చెప్పాలంటే ఆమధ్య సోనమ్‌కి స్వైన్‌ఫ్లూ సోకింది. జాక్వెలైన్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ వచ్చి సపర్యలు చేసింది. వీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి ఇంతకాన్న ఏముంటుంది.
అయితే, ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా… ఓ సినిమాలో అమ్మాయిల విషయంలో నాగచైతన్య ఓ స్ట్రాటజీ చెబుతాడు. ఫ్రెండ్ చెల్లి మనకి చెల్లి అవుతుంది కానీ ఆ చెల్లి ఫ్రెండ్ మనకు చెల్లి అవాల్సిన అవసరం లేదుగా అంటాడు చైతు. ఈ డైలాగ్ అప్పట్లో తెగ పాపులరైంది. దీనినే ఫాలో అయ్యాడు సోనమ్ ముద్దుల తమ్ముడు హర్షవర్దన్ కపూర్.
తన అక్క ఫ్రెండ్ అయిన జాక్వెలిన్ తో కలిసి ఇప్పుడు కుర్ర హీరో హర్షవర్ధన్ కపూర్ ఓ ఫోటో షూట్ చేశాడు. బజార్ బ్రైడ్ మేగజైన్ చేసిన ఈ హాట్ హాట్ ఫోటోషూట్.. ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇందుకు కారణం.. హర్షవర్ధన్ లుక్ కంటే.. శ్రీలంక అందం జాక్వెలిన్ రెచ్చిపోయిన తీరే. ఫ్రంట్ ఓపెన్ అన్నట్లుగా ఫుల్ లెంగ్త్ లో క్లీవేజ్ చూపిస్తూ అమ్మడు ఓ డ్రెస్ వేస్తే.. ఆమె నడుం వెనుక నుంచి చెయ్యి మెలేసి.. ఆమె రెండో చేతిని పట్టుకుని కిక్ ఎక్కించే పోజ్ ఇచ్చాడు హర్షవర్ధన్ కపూర్.
చైతూ చెప్పిన డైలాగ్‌ను ఫాలోఅయిపోయిన హర్షవర్దన్ అందుకే ఇంతగా రెచ్చిపోగలిగాడని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇతగాడు హీరోగా అరంగేట్రం చేసిన మిర్జియా నిరుత్సాహపరిచినా.. కుర్రాడికి డిమాండ్ బాగానే ఉంది.