హరోం హర…రన్‌టైమ్ లాక్!

7
- Advertisement -

హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్రం రన్ టైమ్ ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం యొక్క చివరి రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలు అని నివేదించబడింది. అయితే మేకర్స్ దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. ఈ చిత్రంకు సెన్సార్ బోర్డు వారు A సర్టిఫికేట్ ను ఇవ్వడం జరిగింది.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Also Read:‘దేవకీ నందన వాసుదేవ’.. షూటింగ్ పూర్తి

- Advertisement -