హ‌రోం హ‌ర..అతిథులు వీరే!

6
- Advertisement -

జ్ఞానసాగర్ దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరోం హర. సుధీర్ బాబు కెరీర్‌లో ఇది 18వ సినిమా కాగా ఈ యూత్ ఫుల్ ఎంటర్‌ టైనర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్ అయింది.

జూన్ 14న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుండగా ఇవాళ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు. ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు హైద‌రాబాద్ లోని ద‌స్ప‌ల్లా క‌న్వెష‌న్ లో ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్టులుగా యంగ్ హీరోలు అడివి శేష్‌, విశ్వ‌క్ సేన్, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హాజ‌రుకానున్న‌ట్లు మేకర్స్ వెల్ల‌డించారు.

ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తుండగా మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. సునీల్, రవి కాలె, కేశ‌వ్ దీప‌క్ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Also Read:నందమూరి హీరోలతో గొప్ప అనుబంధం:వైవీఎస్

- Advertisement -