ఓటీటీలోకి హ‌రోంహ‌ర!

23
- Advertisement -

జ్ఞానసాగర్ దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం హరోం హర. సుధీర్ బాబు కెరీర్‌లో ఇది 18వ సినిమా కాగా ఈ యూత్ ఫుల్ ఎంటర్‌ టైనర్ జూన్ 14న ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించగా మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. సునీల్, రవి కాలె, కేశ‌వ్ దీప‌క్ తదితరులు కీలక పాత్ర‌ల్లో పోషించారు.

బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ డేట్ లాక్ అయింది. జూలై 12 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఓటీటీ రిలీజ్ డేట్‌పై త్వరలోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.

సుబ్ర‌మణ్యం (సుధీర్ బాబు) కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా కొత్త‌గా ఉద్యోగంలో చేరుతాడు.అయితే ఓ గొడ‌వ కార‌ణంగా సుబ్ర‌హ్మ‌ణ్యం ఉద్యోగం పోతుంది. డ‌బ్బు కోసం గ‌న్ స్మ‌గ్లింగ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సుబ్ర‌హ్మ‌ణం అడుగుపెడ‌తాడు. ఆ తర్వాత తిరుగులేని గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి ప్రజలను ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ.

Also Read:కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ!

- Advertisement -